ఇచ్ఛాపురం-సుర్లా రోడ్డు రైల్వేస్టేషన్ ట్రాక్ పూర్ణ థియేటర్ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్ద గుర్తుతెలియని రైలు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పలాస జీఆర్పీ ఎస్ఐ షేక్ షరీఫ్ తెలిపారు. పోస్ట్మార్టం కోసం మృత దేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు.