గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం స్పష్టం చేశారు.అలాగే , ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్, రాయబరేలి స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో.. ఏ స్థానంలో ఉండాలి.. ఏ స్థానాన్ని వదులేసుకోవాలనే దానిపై సందిగ్థత ఉండేది. తాజాగా.. వయనాడ్ స్థానాన్ని వదిలేసి రాయబరేలి కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. మరోవైపు.. వదిలేసిన వయనాడ్ ఉపఎన్నికలో తన ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
వయనాడ్ ప్రజలను జీవితాంతం గుర్తుంచుకుంటానని రాహుల్ గాంధీ అన్నారు. తనను వయనాడ్ ప్రజలు ఎంతగానో అభిమానించారని చెప్పారు. ప్రియాంక గాంధీతో పాటు వయనాడ్ కి వెళ్తూ ఉంటానని తెలిపారు. వయనాడ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు. రాయబరేలి నుంచి ఎంపీగా కొనసాగడం సంతోషంగా ఉందని తెలిపారు.అయితే వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని తాను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. 2019, 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వయనాడ్ ప్రజలు తనను గెలిపించారని.. ఇప్పుడు ఆ స్థానాన్ని వదులుకోవడం చాలా కఠినమైన నిర్ణయం అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఏఐసీసీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి తాను ఎంతో మదనపడ్డానని, అక్కడి ప్రజలతో తన బంధం భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ బరిలో ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని భావించినా.. అనూహ్యంగా రాహుల్ పేరును ప్రకటించింది ఏఐసీసీ. కంచుకోటగా ఉన్న ఈ సీటు నుంచి ఇంతకు ముందు వరకు ఎంపీగా కొనసాగారు సోనియా. రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ సెగ్మెంట్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
![]() |
![]() |