జగన్ జీవితం అబద్దాలు, మోసాల మయమని, దోచుకున్న ప్రజా ధనాన్ని పూర్తిగా కక్కిస్తామని కేశినేని చిన్నిఅన్నారు. కొంతమంది అధికారులు జగన్‌కు అంటకాగారని.. వారి సంగతి కూడా బయటకి వస్తుందని, జగన్‌కు త్వరలోనే జైలు జీవితం ఖాయమని ఆయన అన్నారు. పదేళ్లుగా కోర్టుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, చట్టం, న్యాయ పరంగా పాలన ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. జగన్ ఇప్పటికైనా కళ్లు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సారధ్యంలో ఎపీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తారన్నారు. ‘జగన్ ఓ ఫర్నిచర్ దొంగ.. ఇప్పుడయినా వాటిని అప్పగించు’ గతంలో కోడెలను ఇబ్బంది పెట్టిన పాపం ఎవరూ మరచిపోరని కేశినేని చిన్ని అన్నారు.
![]() |
![]() |