విద్యుత్ఘాతానికి గురై ఒక వ్యక్తి సజీవ దహనమయిన విషాద ఘటన చీరాల మండలం ఈపూరుపాలెంలో జరిగింది. ఆ గ్రామంలోని అడ్డరోడ్డు వద్ద హై స్కూల్ సమీపంలో బడ్డీకొట్టు నడుపుకునే బుజ్జి అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీవ్రతకు అతని ఒళ్లంతా కాలిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.
![]() |
![]() |