రామగిరి మండలం పేరూరు గ్రామ సమీపంలో ఉన్న అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సందర్శించారు. ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాంకు సంబంధించిన గేట్లు డ్యామేజ్ కావడంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డ్యాం ఆవరణలో ఉన్న శిలాఫలకాలను పరిశీలించి వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసం చేసిన శిలాఫలకాలను మార్చాలని సూచించారు.