రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో బుధవారం విద్యుత్తు లైన్మెన్ సురేష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ స్తంభం పై లైన్మెన్ సురేష్ నాయక్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో సురేష్ నాయక్ ఒక్కసారిగా స్తంభం పై నుండి క్రింద పడిపోయాడు. అప్పటికే విద్యుత్తు షాక్ తగలడంతో సురేష్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గిద్దలూరు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు.