ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహఇంచిన అనంతరం.. పవన్ బాధ్యతల్ని స్వీకరించి ఫైల్స్‌పై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తన తొలి సంతకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై చేశారు. రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై చేశారు. అనంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపైనా ఆయన చర్చించనున్నారు. బాధ్యతలు స్వీకరించే రోజే వరుస సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విజయవాడలో ఉన్న జలవనరులశాఖకు చెందిన ఇరిగేషన్ కాంప్లెక్స్‌లోని క్వార్టర్లను డిప్యూటీ సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికశాఖల్ని పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే.