ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో బుధవారం పలు పాఠశాలలో బస్సులను దర్శి ఎంవీఐ రవికుమార్ తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బస్సుల ప్రత్యేక తనిఖీ కార్యక్రమం కొనసాగుతుందని, పొదిలిలో మూడు బస్సులు తనిఖీ చేసి ఎఫ్సీ లేకపోవడంతో ఇతర ఇతర ప్రమాణాలు పాటించని మూడు బస్సులపై జరిమానా విధించినట్లు రవికుమార్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.