ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జావిద్ అన్వర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు 200 మంది రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఅన్వర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యవేక్షణలో పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.