రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలిపారు. వైసీపీ పాలనపై చేసిన న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీలకపాత్ర పోషించారన్నారు. న్యాయశాస్త్రంపై మంచి పట్టువన్న న్యాయవాది ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు. ఏజీగా బాధ్యతలు స్వీకరించిన దమ్మాలపాటి ఎన్టీఆర్ జిల్లా వాసి కావటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఏజీగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన దమ్మాలపాటి అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు.