చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడంతో వాల్మీకి పురం, మండలంలోని పోతబోలు గ్రామం జంగం పల్లెకు చెందిన నాగరాజు బుధవారం తిరుమలకు పా దయాత్ర ప్రారంభించాడు. ఐదేళ్ల క్రితం మదనపల్లె నుంచి అమరావతికి పాద యాత్ర చేసిన నాగరాజును అప్పటి మంత్రి నారా లోకేశ ఇంటికి పిలిపించుకుని అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో బుధవారం మండలంలోని సీటీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వ హించి పాదయాత్ర మొద లు పెట్టాడు. జనసేన నా యకురాలు దారం అనిత, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, అయూబ్బాషా, ప్రభాకర్, సురేంద్ర, గోపాల్ పాల్గొన్నారు. వాల్మీకి పురంలో టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్బాషా ఘనస్వాగతం పలికారు మాజీ ఎంపీపీ సురేంద్ర వర్మ, నాయకులు సయ్యద్బాషా, మస్కట్ మసా ్తన, జయకృష్ణ, జంషీద్, మున్వర్, సైదు, ఎండీ యూసుఫ్, మస్తానవల్లి, హుస్సేన, షబ్బీర్అలీఖాన, జావీద్, తదితరులు పాల్గొన్నారు.