‘ప్రజా చైతన్యంతోనే కూటమి అఖండ విజయం సాధించింది. ప్రజా తీర్పుగా భావిస్తున్నాం.. పేదల సంక్షేమం, విద్య వ్యవసాయ, పరిశ్రమ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్ర ప్రజలు కోరుకున్న మార్పుకు అనుగుణంగా నిజాయతీగా చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతాం.. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ విధానాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకువస్తారు’ అని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని సరిపిడకల రామారావు నివాసానికి బుధవారం విచ్చేసిన మంత్రి శ్రీనివాస్, లక్ష్మి సింధు దంపతులను పద్మావతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కమిటీ, హౌసింగ్ బోర్డు డెవలప్‌మెంట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సభకు మందిర అధ్యక్షుడు కంతేటీ వెంకటరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యువతకే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు అభినందనీయులని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి పని చేద్దామన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, జనపాటి మధు, జి.మల్లేశ్వరరావు, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు సరిపిడకల రామారావు, ఎం.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.