అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం అనంతరం తొలిసారి తాడేపల్లి ప్యాలస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పటి వరకూ గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకరు ఛాంబరులోనే వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు.