ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను తొలగించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని తెలుగురైతు జిల్లా కార్యదర్శి మద్దాలి సాయిబాబు కోరారు. అనంతరం విలేకరులతో సాయిబాబు మాట్లాడుతూ..... రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి పాలైం దన్నారు. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా జగన్ ఫొటోలు ఉన్నాయని, ముఖ్య మంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టాలని ఆదేశించినా ప్రభుత్వ అధికారులు పట్టనట్టు వ్యవహరించడం సరికాద న్నారు. తక్షణం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటోలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.