హనుమాన్‌జంక్షన్ పీఎస్ పరిధిలోని బొమ్ములూరు దీపక్ నెక్స్‌జెన్ ఫ్యాక్టరీ వెనుక ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జనార్దన్ తెలిపారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామానికి చెందిన యలకల గౌరినాయుడు(50) ప్రైవేట్ ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ నెల18వ తేదీ మధ్యా హ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ఫ్యాక్టరీ వెనుక భాగంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించామని ఎస్సై జనార్దన్ తెలిపారు. గురువారం మృతదేహానికి గన్నవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు తెలిపారు.