ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 01:08 PM

ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయించి వీలైనంత త్వరలో అమలు చేస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతోందని, స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేస్తానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com