రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గురువారం నరసన్నపేట, మాకివలస గ్రామంలో రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వంశధార శివారు ప్రాంతాలకు సాగునీరు అందిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ రవీంద్రభారతి, ఎంపీపీ ఆరంగి మురళీ, టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్, ఎంపీటీసీ వైవీ నాయుడు, ఏవో సునీత, నాయకులు యాళ్ల వేణుగోపాలరావు, చింతు రామారావు, రావాడ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.