మొబైల్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ తమ ఫోన్లకు లాక్ అం డ్ సెక్యూరిటీ తప్పనిసరిగా వేసుకోవాలని శ్రీకాకుళం ఎస్పీ రాధిక సూచించారు. అందుబాటులో ఉన్న కొత్త సాఫ్ట్‌వేర్ల ద్వారా ఫోన్లలో ఉండే డేటాకు సెక్యూరిటీ వేసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం బిల్లు ఐఎంఈఐ నెంబర్ ఇతర వివరాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. విలువైన సమాచారాన్ని ఫోన్లు ఉంచకుండా జాగ్రత్త వహించాలన్నారు. జిల్లాలోని మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాటిలో 72 మొబైల్స్ ట్రేస్ చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ రాధిక అందజేశారు. ఇప్పటి వరకు 518 ఫోన్లు రికవరీ చేశామని, వాటి విలువ రూ.64 లక్షలు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రికవరీకి కృషి చేసిన సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు జి.ప్రేమ్‌కాజల్, వి.ఉమామహేశ్వరరావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, సైబర్ సెల్ సిబ్బంది రమేష్, శేషగిరి, శరత్, అరవింద్, సత్యనారాయణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.