మహిళ సంచిలో తెచ్చుకున్న 13 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం మేరకు. గాలివీడు మండలానికి చెందిన పి. ప్రమీల ఫిబ్రవరి 28న దేవుని కడప వద్ద బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. దారిలో తాను తెచ్చుకున్న సంచి జిప్ తెరచి ఉండడంతో ఆందోళనగా తెరచిచూశారు. అందులో ఉన్న బంగారం అపహరణకు గురయ్యాయని గమనించి బోరున విలపించారు. కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.