జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు 10 రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత స్థాయిలో శనివారం అధికారులకు ఆదేశాలు పంపారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేర్చారు. రహదారులకు ఇరువైపులా 100 కి. మీలలో ప్లాంటేషన్ చేయనున్నట్లు తెలిపారు.