ఏపీలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే పాఠశాలల విలీనానికి కారణం అయిన 117 జీవో ఖచ్చితంగా రద్దు కావాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లో విడుదల చేసిన 117 జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్య లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనం కావడం వల్ల విద్యార్థులు కాలినడకతో పాఠశాలలకు వెళ్లలేక బడి మానేస్తున్నారన్నారు.