ధర్మవరంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు శనివారం ఉప తహసీల్దారు హంపయ్యకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి సంఘం నేత నిరంజన్ మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని, తనిఖీలు నిర్వహించి చర్యలు కోవాలని కోరారు.