నార్పలలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక పావనిని తండ్రి గణేష్ దారుణంగా హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు నిర్దారించారు. మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ బాలిక తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాలిక తండ్రి గణేష్ బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించారు.