భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. సభలో ముఖ్యమైన పదవి స్పీకర్.. ఆ పోస్ట్ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని వరించింది. సీనియారిటికి ప్రాధాన్యం ఇచ్చి స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. అయ్యన్నపాత్రుడు ఒక్కరే స్పీకర్ పోస్ట్‌కు అప్లై చేయడంతో ఏకగ్రీవమైంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు నేపథ్యం ఏంటి..? తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఎలా ఎదిగారు. ఇప్పటికే కీలకమైన మంత్రి పదవులు చేపట్టి.. మరో అడుగు ముందుకేసి స్పీకర్ చైర్‌లో ఆశీనులయ్యారు.