నాణ్యతలేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటానని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్. సవిత హెచ్చరించారు. విజయవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ..హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆకస్మికంగా వచ్చినట్లు తెలిపారు. హాస్టల్లో సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పనలో నిర్వాహకులు పూర్తిగా అశ్రద్ధ వహించారు. వసతులపై పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.