అన్నమయ్య జిల్లా, సుండుపల్లెకు చెందిన రెడ్డమ్మ పీలేరులోని ఏ. పి. ఎస్. డబ్ల్యూ. ఆర్. ఎస్ గురుకుల విద్యాలయంలోని తన కుమార్తెకు సోమవారం విద్యాసామాగ్రి అందించి, తిరిగి రోడ్డు దాటుతుండగా చిత్తూరు వైపు నుండి పీలేరుకు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించే ప్రయత్నంలో ఆసుపత్రి బయట మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.