రైతులు సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. ముంజేరు సచివాలయ ఆవరణలో సోమవారం ఆమె రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీధర్, టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వందనాల రమణ, ఎంపీడీవో జి.చంద్రకళ, ఏవో హరికృష్ణ, ఉద్యాన శాఖాధికారి జ్యోత్స్న, జనసేన నాయకులు పల్లట్ల జగదీష్, పల్ల రాంబాబు, కోళా రామసూరి, రైతులు పాల్గొన్నారు.