సీజనల్ వ్యాధులైన గ్యాస్ర్టో, మలేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సూపరింటెండెట్ చాంబరులో ఆయన వైద్యులతో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఆసుపత్రి లోని పాత 24 గంటల ల్యాబ్‌లో అంటువ్యాధుల విభాగం (ఐడీ వార్డు)ను ఏర్పాటు చేస్తున్నామని, మగవారికి 10 పడకలు, ఆడవారికి 10 పడకలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఐడీ వార్డులో అవసరమైన లైట్లు, ఫ్యాన్లు, వైరింగ్ పనులను పూర్తి చేయాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. అలా గే ఐడీ వార్డులో అవసరమైన హెడ్‌నర్సు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ విద్యా ర్థులను వేయాలని నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రీబాయిని ఆదేశిం చారు. ప్లేట్‌లెట్ల కోసం పీఆర్‌పీలు అందుబాటుటో స్టాక్ ఉం చుకోవాలని బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. సమీక్షలో ఆసుపత్రి సీఎస్ ఆర్‌ఎంవో వెంకటేశ్వరరావు, మెడిసిన్ ప్రొఫెసర్ ఎస్. లక్ష్మీబాయి, ఐడీ వార్డు ఇన్‌చార్జి ప్రొఫెసర్ బ్లెస్సీ మనోహర్, ఏఆర్‌ఎంవో వెంకటరమణ, బ్లడ్ బ్యాంకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వై.శ్రీధర్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావి త్రీబాయి, ఫార్మసిస్టు గ్రేడ్-1 నరసింహరావు పాల్గొన్నారు.