ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.