జగ్గయ్యపేట నియోజకవర్గంలో మళ్లీ డయేరియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి లక్షణాలతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యా హ్నం వరకూ 15 మంది జగ్గయ్యపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరగా, ఐదుగురిని విజయవాడ రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 19 మందిని డిశ్చార్జి చేశారు. కొత్తగా చేరిన కేసుల్లో జగ్గయ్యపేట పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల వారున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఎం.కృష్ణలత (31), చెరువు బజార్‌కు చెందిన ప్రణ య్ (3), ఎం.విజయలక్ష్మి (24), చిల్లకల్లుకు చెందిన వి.సైదా (40), బూదవాడకు చెందిన బి.మంగ (70), జి.సరోజ (25), పి.కార్తీ (11), పి.కల్యాణి (34), అన్నవరానికి చెందిన బి.ధనమ్మ (25), వత్సవాయి మండలం పెదమోదుగపల్లి గ్రామానికి చెందిన వై.రామారావు (30), డి.నరసింహారావు (40), రావిరాలకు చెందిన వై.బుజ్జి, మంగొల్లుకు చెందిన జి.సిద్ధు (12), ముక్త్యాలకు చెందిన జె.ఎస్తేరు (5) ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసినీ, డీసీహెచ్‌ఎస్ బీసీకే నాయక్, డీపీఎంవో డాక్టర్ నవీన్ పర్యవేక్షణలో డాక్టర్‌లు స్నేహ, సమీరా, బాలాజీ, వాసంతి, అనిల్‌కుమార్, విద్యాసాగర్ సేవలందిస్తున్నారు.