మాది రైతు ప్రభుత్వమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని తదితర సమస్యలపై సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కారక్రరమంలో జేసీ లావణ్యవేణిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రబీ పూర్తయి రెండు నెలలు కావొస్తున్నా రైతులకు ధాన్యం బకాయిలు నేటికీ చెల్లించకపోవడం గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రైతులు నారుమడులు పోసుకునేందుకు ఆ డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 40 కోట్లు ధాన్యం బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పంట కాల్వలు కిక్కిసతో పూడుకుపోయాయని, నారుమళ్లు పోసేందుకు శివారు భూములకు నీరు ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కొడాలి నాని దారినపోయే దానయ్య అని అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కులేదని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి చూపిస్తామన్నారు.