ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారిని ఇనచార్జీ డీఎంహెచవో సుజాత, డీపీఎంవో రవికుమార్ పరామర్శించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో పీపీ యూనిట్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. డయేరియా లక్షణాలు కనిపిస్తున్న గ్రామాల్లో సర్వే చేయాలని, అనుమానిత కేసులను గుర్తించాలన్నారు. అనంతరం షేక్షానుపల్లి, రాచర్ల గ్రామాల్లో సర్యటించారు. తాగునీటి పథకాల వనరులను పరిశీలించారు. మండలంలోని మోపిడి గ్రామంలో డయేరియా కేసులు నమోదవుతుండటంతో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ట్యాంకులను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లోజీ, వైద్యులు గంగాధర్, సాహితీ, వినీత, సూపర్‌వైజర్ నాగరంగయ్య, ఈవోపీఆర్డీ చంద్రమౌళి, సూపర్‌వైజర్ శేఖర్ పాల్గొన్నారు.