కడపజిల్లా ముద్దనూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి గల కారణమైన హాస్టల్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం వారుమాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాసిరకం ఇడ్లీ రవ్వతో వంట చేయడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని మండిపడ్డారు.