ముద్దనూరు పంచాయతీలోని బస్టాండ్, జంతు వధశాల, సులభ్ కాంప్లెక్స్ కు గురువారం గ్రామ సచివాలయంలో ఈఓపీఆర్డీ వీరభద్రుడు బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు తెలిపారు. ఆదాయం కోసం బస్టాండ్ కు సర్కారు నిర్ణయించిన ధర రూ. 8లక్షల 25 వేలు కాగా బహిరంగ వేలంలో వినోద్ అనే వ్యక్తి రూ. 8లక్షల 26వేలుకు దక్కించుకున్నాడు. జంతు వధశాలకు రూ. లక్ష 32 వేలు నిర్ణయించగా, రామ లక్షుమమ్మ రూ. లక్ష 33 వేలకు దక్కించుకున్నట్లు ఈఓపిఆర్డీ చెప్పారు.