చీమకుర్తిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా చీమకుర్తికి వచ్చిన సీఐ దుర్గాప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల చీమకుర్తి తాసిల్దార్ ఆఫీస్ వద్ద ఓ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్ పై బయటకు వెళ్లి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని దగ్గర లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పించినట్లు అభియోగాలు రాగా విచారణ జరిపి ఉన్నతాధికారులు నేరం రుజువు కావడంతో శుక్రవారం సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa