ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, తాటిచెర్ల గ్రామానికి చెందిన బాలిక జెన్నీఫర్ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దాదాపు రూ.30లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైసిపి నాయకులు బాదం వేణుగోపాల్ బాలికకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. లక్ష రూపాయల నగదును బాలిక కుటుంబ సభ్యులకు శనివారం వైసిపి నాయకులు బాదం వేణుగోపాల్ అందజేశారు.