ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గిద్దలూరు తాలూకా యూనిట్ అధ్యక్షులుగా వైపి రంగయ్య ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సంధాని జానీ భాషా, సహా అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారిగా రానా ప్రతాప్ మరియు మిగిలిన 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఎస్వీ రమణారెడ్డి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఏపీ రంగారెడ్డి మరియు అబ్జర్వర్ గా సయ్యద్ మసుద్ అలీ వ్యవహరించారు.