ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు రాజుపేట సముద్రాల హరి రైస్ మిల్లులో గత అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లారీల్లో తరలించటానికి సిద్ధంగా ఉన్న సుమారు 30 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే రెండు వాహనాలు సీజ్ చేశారు. అర్ధరాత్రి నుంచి రైస్ మిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రైస్ మిల్ గౌడౌన్‌లో అక్రమ రేషన్ బియ్యం బస్తాలను భారీగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. రైస్ మిల్‌లో పూర్తి తనిఖీ తరవాత ఎంత మేర అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేశారనే దానిపై ఈరోజు మధ్యాహ్ననం నాటికి పూర్తి సమాచారం తెలుస్తుందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.