అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి బుధవారం ఉదయం పర్యటించారు. ఆయన రాంనగర్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశీలించారు. అలాగే ప్రతిరోజు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న పార్కులు పరిశుభ్రతతో ఉంచాలని అధికారులకు సూచించారు. అనంత నగర పరిశుభ్రతకు అందరం కలిసి కృషి చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.
![]() |
![]() |