విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని కృష్ణాదేవిపేట అల్లూరి స్మృతివనం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నర్సీపట్నం డివిజనల్ రెవెన్యూ అధికారి హెచ్‌వీ జయరాం తెలిపారు. మంగళవారం ఆర్డీవో జయరాం గొలుగొండ మండల స్ధాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో జయంతికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పార్కును పరిశీలించి పార్కు ముఖద్వారం, విగ్రహాలు, ఆవరణలో రంగులు, ముగ్గులు వేయించాలని ఆదేశించారు. అలాగే అల్లూరి జయంతి రోజున నాలుగు మండలాల నుంచి విద్యార్థులు అల్లూరి వేషధారణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కృష్ణాదేవిపేట రామాలయం నుంచి విద్యార్థులతో ప్రారంభకానున్న భారీ ర్యాలీకి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి పార్కులో ఈ నెల 4న జయంతి కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. వీరందరి రాకకు అనుకూలంగా సభా వేదిక, పరిసరాలు పరిశుభ్రత, భద్రత వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో గొలుగొండ మాజీ జడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్, జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి వి.నాగశిరీష, నర్సీపట్నం రూరల్ సీఐ బి.హరి, కృష్ణాదేవిపేట రేంజర్ సుంకర వెంకటరావు, కృష్ణాదేవిపేట ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర, ఈవోపీఆర్‌డీ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌భరత్, పలు శాఖలు జేఈఈలు అరుణకుమారి, రాజేంద్రప్రపాద్, సుదీసన, ఆర్‌ఐలు నాగరాజు, నారాయణరావు, కొడబాబు, కార్యదర్శిలు శ్రీనివాస్, రఘు, రాజేష్, టీడీపీ నాయకులు బొడ్డు జమీలు, పెట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |