చిట్‌ల పేరుతో ఓ మహిళ సుమారు రెండు కోట్ల రూపాయలకు టోకరా వేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం, గోపాలపట్నం 89వ వార్డు ఎల్లపువానిపాలేనికి చెందిన ఆళ్ల కనకమహాలక్ష్మి దాదాపు మూడు దశాబ్దాలుగా చిట్‌లు నిర్వహిస్తోంది. ఆమెపై పూర్తిగా నమ్మకం ఏర్పడడంతో ఎల్లపువానిపాలేనికి చెందిన వారితో పాటు వారి బంధువులు కూడా పెద్దసంఖ్యలో చిట్ వేశారు. అయితే గత ఏడాదికాలంగా ఆమె చిట్ వేసిన వారికి సకాలంలో నగదు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో బాధితులు మంగళవారం ఉదయం ఆమె ఇంటికి చేరుకుని తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులంతా గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమకు సుమారు రెండు కోట్ల రూపాయలను కనకమహాలక్ష్మి చెల్లించాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |