గిరిజన ద్రోహి జగన్‌రెడ్డి అని.. గత ఐదేళ్లలో గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేశారని గిరిజన సంక్షేమ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. సాలూరులోని తన నివాసంలో ఆమె మంగళ వారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అరకు ఎంపీ తనూజారాణి మొదటి రోజు లోక్‌సభ సమావేశంలో నచ్చినట్లు ఎవరో రాసిన స్ర్కిప్ట్ చదివేశారని ఎద్దేవా చేశా రు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అక్కడ మోకరిల్లిందని విమర్శించారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని ఎన్టీఆర్ జీవో నెం3ను తీసుకొ చ్చారని గుర్తు చేశారు. దీనిని సుప్రీంకోర్టులో కొట్టివేసి నాలుగేళ్లవుతున్నా సైకో ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వంలో అడవులను పూర్తిగా ధ్వంసం చేసి.. మైనింగ్ వ్యాపారంతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఐటీడీఏ, జీసీసీలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారన్నారు. వెదురు కోసం గిరిజనులు అడవులకు వెళితే వారిపై కేసులు పెట్టారని అన్నారు. కాఫీకి బదులు గంజాయి తోటలు పెంచాలని వైసీపీ నేతలు గిరిజనులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు.
![]() |
![]() |