సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని నయారా పెట్రోల్ బంకు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న రెండు స్పోర్ట్స్ ద్విచక్ర వాహనాలు ఒక దానికి ఒకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 పైలట్ రామాంజనేయులు, సిబ్బంది నాగరాజులు వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.