టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం దాఖలు చేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకూ రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేసిన ఈసీ వాటిని ఆమోదించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 5వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. టీడీపీ తరఫున సి.రామచంద్రయ్య, జనసేన తరఫున పి.హరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయే అవకాశం ఉంది. మంగళవారం నామినేషన్లు వేసే సమయంలో రామచంద్రయ్యతోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, ఎన్‌ఎండీ ఫరూక్ పాల్గొన్నారు. అలాగే హరిప్రసాద్‌తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.
![]() |
![]() |