తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చి చెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
![]() |
![]() |