విజయవాడ నగరంలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్, నెట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం నిరసన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యూ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.