ట్రంప్‌తో గతవారం అట్లాంటాలో జరిగిన డిబేట్లో తాను దాదాపు నిద్రపోయానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ‘‘చర్చకు ముందు విదేశీ పర్యటనలొద్దని మా సిబ్బంది చెప్పారు. అయినా వినకపోవడంతో ఆ ప్రభావం నాపై పడింది. బాగా అలసిపోవడంతో డిబేట్ సమయంలో వేదికపై దాదాపు నిద్రపోయాను. అయితే నేను కారణాలు వెతకాలని అనుకోవట్లేదు’’ అని పేర్కొన్నారు. డిబేట్లో ట్రంప్ ఎదుట బైడెన్ తేలిపోయిన సంగతి తెలిసిందే.