తాడిపత్రి మండలంలోని పులిప్రొద్దుటూరు సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. తాడిపత్రి నుంచి స్వగ్రామం ఇగుడూరు కు బైక్ లో వెళ్తుండగా కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని అనంతపురానికి తరలించారు.