రాయదుర్గం: ఆర్అండ్ బి అతిథి గృహం వద్ద గురువారం పలువురు వైసిపి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. 16 మంది వైసిపి కౌన్సిలర్లు కలవడంతో మిగిలిన కౌన్సిలర్లు ఆశ్చర్యానికి గురిఅయ్యారు. అభివృద్ధికి అన్నిరకాల సహకరిస్తామని ఎమ్మెల్యే కాలవకి వైసీపీ కౌన్సిల్లర్లు తెలిపారు. అనంతరం కాలవని సన్మానించి శుభాకాంక్షలుతెలిపారు. డిష్ గోవిందు, దేవరాజ్ తదితరులు కలసిన వారిలో ఉన్నారు.