హిందూపురం డివిజన్ వ్యాప్తంగా విద్యాసంస్థలు బంధు విజయవంతం అయినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నీట్ పరీక్షను రద్దు చేయాలని ఎన్ టిఏ సంస్థను రద్దు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రభుత్వ పాఠశాల మూసివేతను ఆపాలని, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు నిర్బంధాలు పై దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపినట్లు తెలిపారు.